విదేశీ ఉద్యోగ మేళాకు విశేష స్పందన* *వేలాదిగా తరలివచ్చిన యువత* *లాంఛనంగా ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే*

వేగుచుక్క న్యూస్, నిజామాబాద్, జూలై 02 : జిల్లా శిక్షణ ఉపాది కల్పన శాఖ ఆధ్వర్యంలో టామ్ కామ్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన విదేశీ ఉద్యోగ మేళా, జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. గురువారం స్థానిక వర్ని చౌరస్తా సమీపంలోని జనార్దన్ గార్డెన్ లో నిర్వహించిన జాబ్ మేళాకు ఐదు వేల పైచిలుకు మంది యువత తరలివచ్చారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్.భూపతి రెడ్డి, నగర మేయర్ ఉమారాణి, ఉపాధి కల్పన శాఖ డైరెక్టర్ కాంతి వెస్లీ, కలెక్టర్ ఇలా త్రిపాఠి తదితరులు జాబ్ మేళాను సందర్శించారు. వివిధ కంపెనీలలో ఉద్యోగాల కోసం ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా...