గల్ఫ్ కార్మికుల ఓటు హక్కులను పరిరక్షించాలి: సాటా సౌదీ అరేబియా రియాద్ అధ్యక్షుడు శ్రీనివాస్ మచ్చ

రియాద్: ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమం సందర్భంగా విదేశాల్లో నివసిస్తున్న గల్ఫ్ కార్మికులు, ప్రవాస భారతీయులు (ఎన్నారైలు) తమ ఓటరు హక్కులను కోల్పోకుండా ఉండేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాలని సాటా (SATA) సౌదీ అరేబియా – రియాద్ అధ్యక్షుడు శ్రీనివాస్ మచ్చ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన గల్ఫ్ కార్మికులు, ఎన్నారైలు తమ పేర్లు ఓటరు జాబితాల్లో కొనసాగించుకునేలా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ముఖ్యంగా ఆన్‌లైన్ ఓటరు నమోదు, సవరణ, ధృవీకరణ సేవలను మరింత సులభతరం చేసి విదేశాల్లో నివసిస్తున్న భారతీయులకు అందుబాటులోకి...