🏠 veguchukkanews.online
Watermark
Newspaper Logo
veguchukkanews.online | Date: 16 Nov, 2026 | Page: 1

జిల్లా మున్నూరు కాపుల అభివృద్ధి కోసం కృషి. - బాజిరెడ్డి జగన్మోహన్ పటేల్.



- పంచముఖి మున్నూరు కాపు సంఘంలో సభ్యత్వం నమోదు.

వేగుచుక్క న్యూస్, నిజామాబాద్: జిల్లా మున్నూరు కాపుల అభ్యున్నతికి, అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని బాజిరెడ్డి జగన్మోహన్ పటేల్ అన్నారు. సోమవారం పంచముఖి మున్నూరు కాపు సంఘం అధ్యక్ష కార్యదర్శులు మిద్దె రవికుమార్, దారం పోతన్న, కార్యవర్గం ఆధ్వర్యంలో వినాయక నగర్ లోని సంఘ భవనంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంచముఖి మున్నూరు కాపు సంఘంలో సభ్యత్వం తీసుకున్నారు. సంఘ సభ్యులు జగన్మోహన్ పటేల్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి జగన్మోహన్ పటేల్ మాట్లాడుతూ.. పంచముఖి మున్నూరు కాపు సంఘంలో సభ్యత్వం తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. మున్నూరు కాపులు ఐక్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలరని, ప్రతి ఒక్కరు ఐక్యత కోసం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మున్నూరు కాపులు రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. కాపులంతా ఎలాంటి భేషజాలకు పోకుండా ఒకరికొకరు సహాయ సహకారం అందించుకున్నపుడే కులం అభివృద్ధి చెందుతుందన్నారు.
పంచముఖి మున్నూరు కాపు సంఘంలో వందకు మందికి పైగా సభ్యులు అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ఉండడం తనను ఆకర్షించిందన్నారు. పంచముఖి మున్నూరు సంఘంతో పాటు, అన్ని సంఘాల అభివృద్ధిని
తాను ఆకాంక్షిస్తున్ననన్నారు.

*అధ్యక్ష,కార్యదర్శులు, కోశాధికారి మిద్దె రవికుమార్, దారం పోతన్న, కర్క రమేష్ లు మాట్లాడుతూ..*

సంఘం అభివృద్ధి కోసం మాజీ ఆర్టీసీ చైర్మన్, మాజీ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తనయుడు బాజిరెడ్డి జగన్మోహన్ పటేల్ ను సంఘ సభ్యత్వం తీసుకోవాలని కోరడం జరిగిందన్నారు. పంచముఖి మున్నూరు కాపు సంఘం గురించి తనకు ముందే తెలుసని, అన్నదమ్ముల వలె కలిసి మెలిసి ఐక్యతతో ఉండటం అభినందనీయం అని చెప్పడంతో పాటు సంఘంలో సభ్యత్వం తీసుకున్నందుకు ఆయనకు సాదర స్వాగతంతో పాటు శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో కోశాధికారి కర్క రమేష్, గౌరవ అధ్యక్షులు ఆకుల శ్రీశైలం, ముఖ్య సలహాదారులు హరిదాస్ సాయి రెడ్డి, వైసాక్షి సంతోష్, ఉపాధ్యక్షులు ముకుందం శ్రీనివాస్, పెద్ద కాపులు ధర్మేందర్, జగదీష్, మారుతి, సహాయ కార్యదర్శి
రఘునందన్, ప్రచార కార్యదర్శి సంతోష్, కార్యవర్గ సభ్యులు ఆకుల తిరుమల్, బొబ్బిలి కిషన్, రవీందర్, శివకుమార్, పంచముఖి మున్నూరు కాపు సంఘ సభ్యులు పాల్గొన్నారు.
🏠 Home