మోడీ జమానాలో కొత్త భూస్వామ్యం.కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు. - నల్గొండలో ఎఐకెఎస్ బహిరంగ సభలో వక్తల పిలుపు.
ఎరుపెక్కిన "నల్గొండ"...
- రైతు భూముల బలవంతపు ఆక్రమణ.
- నగరంలో భారీ ర్యాలీ, కదం తొక్కిన అన్నదాతలు.
వేగుచుక్క న్యూస్ - నల్గొండ:
కేంద్రంలోని మోడీ ప్రభుత్వ పన్నెండేళ్ల ఏలుబడిలో అమలు చేస్తున్న వేగవంతమైన పెట్టుబడీ దారీ వ్యవసాయ విధానం దేశంలో కొత్త భూస్వామ్య వ్యవస్థను పాదుకొల్పుతోందని, ఆ వినాశకర విధానాలకు వ్యతిరేకంగా రైతాంగం ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని అఖిల భారత కిసాన్ సభ (ఎఐకెఎస్) నల్గొండలో ఆదివారం నిర్వహించిన భారీ బహిరంగసభలో వక్తలు పిలుపునిచ్చారు. ఎనభై శాతంగా ఉన్న చిన్న, సన్నకారు, మధ్యతరగతి రైతుల భూములను బలవంతంగా గుంజుకొని కార్పొరేట్లకు అప్పగించడం వలన భూమి కేంద్రీకరణ జరుగుతోందని పేర్కొన్నారు. నాటి భూస్వాములు, దేశ్‌ముఖ్‌ల దోపిడీ, వెట్టిచారీల నుంచి విముక్తి కోసం దున్నే వాడికే భూమి నినాదంతో సాగిన చారిత్రాత్మక వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట పురిటిగడ్డ అయిన నల్గొండ నుంచి కార్పొరేట్ భూస్వామ్యాన్ని సవాల్ చేయాలని నిర్దేశం కావించారు. ఎఐకెఎస్ 36వ అఖిలభారత మహాసభ నవంబర్ 15-18 నాలుగు రోజులపాటు నల్గొండలో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నగరంలో భారీ ర్యాలీ, అనంతరం ఎన్‌జి కళాశాల మైదానంలో బహిరంగసభ నిర్వహించారు. మహాసభ ఆహ్వానసంఘం ఛైర్మన్, మాజీ ఎంఎల్‌ఎ జూకంటి రంగారెడ్డి సభకు అధ్యక్షత వహించారు. ముఖ్య వక్తగా మాజీ పార్లమెంట్ సభ్యులు బృందా కరత్ ప్రసంగిస్తూ... దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 80 ఏళ్ల తర్వాత అధికారం వెలగబెడుతున్న బిజెపి ప్రభుత్వం రాజ్యాంగాన్ని అంగకరించట్లేదు. మన వ్యవసాయాన్ని, రైతులను కార్పొరేట్ల చేతుల్లో పెడుతోంది. మూడు నల్ల వ్యవసాయ చట్టాలు అందుకు పెద్ద ఉదాహరణ. వాటికి వ్యతిరేకంగా రైతులు రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో సుదీర్ఘంగా పోరాడి ఉపసంహరించుకొనేలా మోడీ సర్కార్ మెడలు వంచారు. అయినా వాటిని దొడ్డిదారిలో చొప్పిస్తోంది ప్రభుత్వం. చిరుతపులి చారలు మాసిపోవు, కుక్క తోక సాఫీ కాదు అన్నట్లుంది మోడీ ప్రభుత్వ వ్యవహారం. దాని వర్గ స్వభావం మారదు. ల్యాండ్ సీలింగ్ కోసం కోసం ఎఐకెఎస్ పోరాడాలి. ఎఐకెఎస్ ఏర్పడి 90 ఏళ్లయింది. నాడు బ్రిటిష్ సామ్రాజ్యవాద వేధింపులకు వ్యతిరేకంగా పోరాడింది. ప్రస్తుతం మోడీ ప్రభుత్వం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వద్ద సాష్టాంగపడి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకొని రైతులను బలి చేయాలని చూస్తోంది. అందుకు వ్యతిరేకంగా రైతులు.. వ్యవసాయ కూలీలు, ఇతర ప్రజానీకంతో కలిసి తిప్పికొట్టాలి. రైతుల, వ్యవసాయ కార్మికుల హక్కుల కోసం ఎఐకెఎస్ పోరాడుతుంది. ఆ వర్గాలకు అండగా నిలుస్తుంది. తెభాగా, వర్లీ, వీర తెలంగాణ... ఎన్నో పోరాటాలకు నాయకత్వం వహించింది. ఖబడ్డార్, వీర తెలంగాణ పోరాటాన్ని సైతం మతీకరిస్తే సహించం. పంటలకు కనీస మద్దతు ధరల విషయంలో స్వామినాథన్ నివేదికను, నరేగాను ఆపేశారు. ఆదివాసీల హక్కులను కాలరాసి వారిని అడవుల నుంచి బలవంతంగా వెళ్లగొట్టే దుర్మార్గానికి మోడీ ప్రభుత్వం బరి తెగించింది. ఆదివాసీ హక్కుల పోరాట యోధుడు దిర్శా ముండా జయంతి నవంబర్ 15. ఆయన చూపిన బాటలో ఎఐకెఎస్ నడుస్తుంది. నల్గొండలో జరుగుతున్న ఎఐకెఎస్ మహాసభ నిర్ణయాలు రైతాంగ పోరాటాలపై కొత్త వెలుగులు ప్రసరించాలి. రానున్న కాలంలో జరిగే పోరాటాలను నిర్దేశించాలని ఆశిస్తున్నాను... అని బృందా కరత్ ఆకాంక్షించారు. ఆమె తన ప్రసంగాన్ని ‘సోదరీ సోదరులారా అందరికీ నమస్కారం..’ అంటూ తెలుగులో ప్రసంగించి సభికులను ఉత్సాహపరిచారు.
రోజుకు 114 ఆత్మహత్యలు
మోడీ వచ్చాక పుష్కర కాలంలో దేశంలో ఐదు లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఎఐకెఎస్ జాతీయ అధ్యక్షులు అశోక్ ధావలే ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి రోజూ 114 మంది బలవంతంగా చనితున్నారని చెప్పారు... పంటలకు ఎంఎస్‌పి లేకనే రైతుల బలవన్మరణాలు జరుగుతున్నాయి. సంక్షోభంలో ఉన్న రైతుల రుణాలు మాఫీ చేయమంటుంటే ససేమిరా అంటున్న మోడీ ప్రభుత్వం, కార్పొరేట్ల రూ.16 లక్షల కోట్ల రుణాలను ఏకపక్షంగా రద్దు చేసింది. అధికారం లేనప్పుడే తెలంగాణాలో నాడు రైతాంగ పోరాటం ద్వారా పది లక్షల ఎకరాలను ఎర్ర జెండా పంచింది. అనంతరం కేరళ, బెంగాల్, త్రిపురలో అధికారంలోకొచ్చాక లక్షల ఎకరాలను పంచాయి. మనకు రాజ్యాధికారం కావాలి. రైతు, కార్మిక, సామాజిక, ప్రజా సమస్యలపై పోరాడుతూనే రాజకీయ కర్తవ్యాన్ని కూడా తీసుకోవాలి. ఎస్‌ఐఆర్ ముసుగులో కోట్లాది ఓట్ల తొలగింపులు జరుగుతున్నాయి. ఓట్ చోర్, అయోధ్య మందిరంలో కానుకల చోర్ మోడీని గద్దె దిగమని ఉద్యమించాలి. ఈ రాజకీయ కోణాన్ని ముందుకు తీసుకుపోవాలి... అని అశోక్ థావలే కోరారు.
ప్రత్యామ్నాయ విధానాలపై చర్చిస్తాం
మోడీ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఎఐకెఎస్ ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్ చెప్పారు.,, రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం డూ ఆర్ డై (బతకడమో, చావడమో) అన్న రీతిలో పోరాటాల్లోకి రావాలి. బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా ఉద్యమాల్లోకి కదలాలి. నాడు నైజాం సర్కార్‌కు ఘోరీ కడతామన్న నేల ఇది. సామ్రాజ్యవాదానికి ఘోరీ కడతామని ఇక్కడి నుంచి హెచ్చరిస్తున్నాం. తెలంగాణాలో కరువు సమస్యను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాచివేతతో ఉన్నాయి. రెండు నెలలు సమయం ఇస్తున్నాం. స్పందించకుంటే సూర్యాపేట నుంచి హైదరాబాద్ వరకు లక్ష మంది రైతులతో లాంగ్ మార్చ్ నిర్వహిస్తాం... అని విజూ కృష్ణన్ హెచ్చరించారు. సభలో తెలంగాణ రైతు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పోతినేని సుదర్శన్, టి సాగర్ ప్రసంగించారు. తొలుత ఆహ్వానితులకు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి స్వాగతం పలకగా వేదికపై ఎఐకెఎస్ నాయకులు, ఎంపి అమ్రారామ్, ప్రజాసంఘాల నాయకులు ఎఆర్ సింధు, శ్రీమతి, పుణ్యవతి, జాన్ వెస్లీ, ఎం సాయిబాబు, ఎపి రైతుసంఘం అధ్యక్ష, కార్యదర్శులు వి క్రిష్ణయ్య, కె ప్రభాకర్‌రెడ్డి, ఎఐకెఎస్ జాతీయ నాయకత్వం ఆశీనులయ్యారు. పిఎన్‌ఎం కళాకారుల ప్రదర్శనలు, ఆలపించిన విప్లవ గీతాలు సభికులను ఉత్సాహపరిచాయి. పుచ్చలపల్లి సుందరయ్యపై జగన్ పాడిన పాట ఆలోచింపజేసింది. నల్గొండ గద్దర్‌గా పేరుగాంచిన నర్సిరెడ్డి తన గీతాలతో ఆలరింపజేశారు.