🏠 veguchukkanews.online
Watermark
Newspaper Logo
veguchukkanews.online | Date: 14 Nov, 2026 | Page: 1

నల్లకుంట ప్రభుత్వ పాఠశాలలో.. ఘనంగా "బాలల దినోత్సవ వేడుకలు".


- రెండు రోజుల పాటు ఆటలు, వివిధ అంశాల్లో పోటీలు.. విజేతలకు బహుమతుల ప్రదానం.

వేగుచుక్క న్యూస్, హైదరాబాద్: నల్లకుంట ప్రభుత్వ పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారత ప్రథమ ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకుని పాఠశాలలో విద్యార్థులకు రెండు రోజుల పాటు వివిధ క్రీడా, సాంస్కృతిక పోటీలు నిర్వహించారు. శనివారం నిర్వహించిన ముగింపు వేడుకలు పండుగ వాతావరణంలో ఉత్సాహంగా సాగాయి.

ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముత్యాల రవీందర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం జరుపుకునే బాలల దినోత్సవం విద్యార్థులకు చదువుతో పాటు ఆటపాటల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తుందన్నారు. చాలా ఏళ్ల తర్వాత పాఠశాలలో రెండు రోజుల పాటు పండుగ వాతావరణంలో వివిధ పోటీలు నిర్వహించడం ఆనందంగా ఉందని తెలిపారు. పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు.

ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక ఉప విద్యాధికారి లక్ష్మణ్ సింగ్ విద్యార్థులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కో-కో, కబడ్డీ, పాటలు, ఉపన్యాసం, వ్యాసరచన తదితర పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత ప్రథమ ప్రధానిగా పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ దూరదృష్టితో చేపట్టిన అనేక సంస్కరణల ఫలితాలను నేడు శాస్త్రసాంకేతిక, వ్యవసాయ రంగాల్లో చూస్తున్నామని పేర్కొన్నారు. నెహ్రూకు పిల్లలంటే అమితమైన ప్రేమ ఉండేదని, అందుకే ఆయన జన్మదినాన్ని బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కవిత, నాగమణి, సుజిత, ప్రశాంతి, రమేష్, అనిల్ కుమార్, సురేంద్రరెడ్డి, యాదయ్య, విమల, నాగలత, హిమబిందు, అరుణ, ఆంజనేయులు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home