🏠 veguchukkanews.online
Watermark
Newspaper Logo
veguchukkanews.online | Date: 09 Nov, 2026 | Page: 1

హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం! *బాణసంచా దుకాణంలోకి దూసుకెళ్లిన రాకెట్.. షాప్ మొత్తం దహనం!*

వేగుచుక్క న్యూస్, హైదరాబాద్ :
దీపావళి వేడుకల వేళ సికింద్రాబాద్ పరిధిలోని నామలగుండులో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికులు అంటించిన ఒక రాకెట్ గాల్లోకి లేచి నియంత్రణ కోల్పోయి నేరుగా అక్కడే ఉన్న ఒక బాణసంచా దుకాణంలోకి దూసుకెళ్లి పడింది. ఆ రాకెట్ నిప్పురవ్వలు తగలడమే ఆలస్యం.. దుకాణంలో నిల్వ ఉంచిన పటాకాయలన్నీ ఒకదాని తర్వాత ఒకటి భారీ శబ్దాలతో పేలడం ప్రారంభించాయి. క్షణాల వ్యవధిలోనే మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడి, షాప్ మొత్తాన్ని చుట్టుముట్టి పూర్తిగా దహనం చేసేశాయి. ఆకాశాన్ని తాకిన దట్టమైన పొగలు, వరుస పేలుళ్ల ధాటికి వాహనదారులు, స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురై ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో షాప్ పూర్తిగా కాలి బూడిదవ్వగా, భారీగా ఆస్తి నష్టం సంభవించింది.
🏠 Home