🏠 veguchukkanews.online
Watermark
Newspaper Logo
veguchukkanews.online | Date: 04 Nov, 2026 | Page: 1

నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్.. అధికారిక వెబ్‌సైట్‌ ప్రారంబించిన సిపి.


- సోషల్ మీడియా హ్యాండిల్స్ ప్రారంభించిన పోలీస్ కమిషనర్.

వేగుచుక్క న్యూస్:
నిజామాబాద్ జిల్లా సెక్యూరిటీ కౌన్సిల్‌కు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్‌ మరియు సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను బుధవారం పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, సెక్యూరిటీ కౌన్సిల్ చేపడుతున్న కార్యక్రమాలు , కార్యకలాపాలు మరియు భద్రతకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడంలో అధికారిక వెబ్‌సైట్‌ , సోషల్ మీడియా వేదికలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటూ ప్రజలకు అవసరమైన సమాచారాన్ని సులభంగా అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ డాక్టర్ కవితా రెడ్డి , ట్రెజరర్ కె. సంతోష్ కుమార్ , జాయింట్ సెక్రటరీ కాకతీయ రజినీకాంత్ , వి. దుష్యంత్, హిటెన్ బిమాని, డాక్టర్ శిరీష్ కుమార్, కమల్ ఇనాని , కె. శ్రీనివాస్ రెడ్డి, నిజామాబాదు ట్రాఫిక్ ఎ.సి.పి ప్రకాష్, మస్తాన్ అలీ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home