🏠 veguchukkanews.online
Watermark
Newspaper Logo
veguchukkanews.online | Date: 21 Oct, 2026 | Page: 1

నేటి తరానికి ఆదర్శం ఆ "స్నేహితులు.. - 37 ఏళ్లుగా చెక్కుచెదరని స్నేహబంధం..


- ప్రతి ఏడాది దసరా మరుసటి రోజు అసలైన పండుగ వీరికి.

- ఘనంగా బాల్య మిత్రుల ‘హాలాయ్ బలాయ్’!

- చిన్ననాటి జ్ఞాపకాల నెమరువేత.. కష్టసుఖాల్లో తోడుగా నిలుస్తూ.. సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా పూర్వ విద్యార్థులు

"కాలం మారినా.. చదువులు పూర్తయి దశాబ్దాలు గడిచినా.. బాల్య స్నేహానికి మాత్రం ఎలాంటి హద్దులు ఉండవని నిరూపించారు నిజామాబాద్ నగరంలోని శ్రీ నూతన వైశ్య ఉన్నత పాఠశాల (మాణిక్య భవన్) 1988-89 బ్యాచ్ పూర్వ విద్యార్థులు. పది కాదు, ఇరవై కాదు... 37 ఏళ్లుగా తమ స్నేహాన్ని ఎన్నడూ వీడకుండా నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎవరు, ఎక్కడ, ఏ ఊరిలో ఉద్యోగాలు, కుటుంబాలతో జీవిస్తున్న దసరా పండుగ తెల్లారి తాము చదువుకున్న పాఠశాలల్లో కలుసు కోవాలనే నిబంధన పెట్టుకొని, దానిని అందరూ పాటిస్తూ దసరా మరుసటి రోజు వారు అసలు పండుగ జరుపుకుంటున్నారు. వారి కుటుంబాల్లో ఎవరికి , ఏ ఆపద వచ్చినా సమష్టిగా అండగా నిలవడం జరుగుతుంది. ప్రతి ఏడాది లాగే దసరా పండుగను పురస్కరించుకొని బుధవారం తాము చదువుకున్న పాఠశాలలోనే బాల్య మిత్రుల ఆత్మీయ సమ్మేళనం ‘హాలాయ్ బలాయ్’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. వివిధ జిల్లాల్లో నివసిస్తున్న మిత్రులు సైతం తరలివచ్చి, చిన్ననాటి స్నేహాన్ని మరోసారి గుర్తుచేసుకున్నారు."

*వేగుచుక్క న్యూస్, నిజామాబాద్:*
*
పాఠశాల ప్రాంగణంలో కలుసుకున్న మిత్రులంతా పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆనందంగా గడిపారు. తరగతి గదుల్లో చేసిన అల్లరి, ఉపాధ్యాయులతో గడిపిన రోజులు, పాఠశాల జీవితంలోని మధురానుభూతులను ఒకరితో ఒకరు పంచుకున్నారు. ఏళ్ల తర్వాత కలుసుకున్నా తమ మధ్య స్నేహం, ఆప్యాయత ఏమాత్రం తగ్గలేదని ఈ సమ్మేళనం మరోసారి చాటిచెప్పింది.

*కష్టసుఖాల్లో తోడుగా.. ఆపన్నులకు అండగా!*

ఈ మిత్రబృందం ప్రత్యేకత కేవలం ఏటా కలుసుకోవడమే కాదు.. ఒకరికొకరు అండగా నిలవడం కూడా. స్నేహితుల్లో ఎవరికైనా వ్యక్తిగతంగా సమస్యలు ఎదురైతే అందరూ కలిసి చర్చించి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఎవరైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటే, మిత్రులంతా తమకు తోచిన విధంగా ఆర్థిక సహాయం అందిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు.

అంతేకాకుండా, మిత్రుల పిల్లల వివాహ వేడుకలకు అందరూ హాజరవుతూ కుటుంబ సభ్యుల్లా కలిసిమెలిసి ఉంటున్నారు. స్నేహబంధాన్ని సామాజిక సేవతో ముడిపెడుతూ పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు.

*ఏటా దసరా మరుసటి రోజు ఆత్మీయ సమ్మేళనం*

ప్రతి సంవత్సరం దసరా మరుసటి రోజు ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించుకోవడం తమ ఆనవాయితీగా మార్చుకున్నామని మిత్రులు తెలిపారు. ఈ ఏడాది కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉత్సాహంగా కార్యక్రమాన్ని జరుపుకున్నారు. ఈ సమ్మేళనంలో మొత్తం 37 మంది బాల్య మిత్రులు పాల్గొన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి అధ్యక్షులుగా యంసాని రవీందర్, ప్రధాన కార్యదర్శిగా చింతల గంగాదాస్, మిత్ర సమన్వయకర్తగా వారణాసి మల్లికార్జున్ వ్యవహరించారు.
🏠 Home