🏠 veguchukkanews.online
Watermark
Newspaper Logo
veguchukkanews.online | Date: 27 Sep, 2026 | Page: 1

సైక్లింగ్ లో సత్తా చాటాలి...నిజామాబాద్ ఎంపీ అరవింద్.

దేశంలోనే అత్యధికంగా రిజిస్ట్రేషన్లు జిల్లా నుంచి రావడం సంతోషం అని వెల్లడి.

వేగుచుక్క న్యూస్, నిజామాబాద్: విద్యార్థులు, యువత సైక్లింగ్ క్రీడల్లో మరింతగా రాణించాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆకాంక్షించారు. ఖేలో ఇండియా ఆధ్వర్యంలో ఇందూరు బైపాస్ రోడ్డులో ఆదివారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి అస్మిత రోడ్ సైక్లింగ్ పోటీలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి క్రీడాకారులు ఈ పోటీల కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ... రోడ్ సైక్లింగ్ పోటీలకు దేశంలోనే అత్యధికంగా రిజిస్ట్రేషన్లు నిజామాబాద్ నుంచి నమోదుకావడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. జిల్లాలో సైక్లింగ్ పై యువతలో పెరుగుతున్న ఆసక్తికి ఇది నిదర్శనమన్నారు. క్రీడాకారులు ప్రతిభను నిరూపించుకుని రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, మేయర్ ఉమారాణి, రాష్ట్ర సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు ముల్లారెడ్డి, కార్యదర్శి విజయకాంత్ రావు, జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు కృపాకర్ రెడ్డి, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఈగ సంజీవరెడ్డి, కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య సీనియర్ న్యాయవాది రాజేందర్ రెడ్డి, ఎస్ఆర్ విద్యాసంస్థల డీజీఎం గోవర్ధన్ రెడ్డి, నగర కార్పొరేటర్లు పాల్గొన్నారు. 33 జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
🏠 Home