🏠 veguchukkanews.online
Watermark
Newspaper Logo
veguchukkanews.online | Date: 06 Sep, 2026 | Page: 1

బాలుడి కిడ్నాఫ్ కేసు చేదన.. - దౌల్తాబాద్ లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు


వేగుచుక్క న్యూస్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మతాశిశు సంరక్షణ ఆసుపత్రి నుంచి బాలుడిని కిడ్నాప్ చేసిన మహిళ తో పాటు ఓ వ్యక్తిని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. శనివారం ఆసుపత్రి నుంచి పిల్లలకు చాక్లెట్ ఆశచూపి బాలుడిని కిడ్నాప్ చేసింది. దీంతో ఈ విషయంలో జిల్లాలో కలకలం రేపింది. బాల్కొండ మండలంలోని నాగాపూర్ గ్రామానికి చెందిన భార్యభర్తలు ఇద్దరు పిల్లలతో కలిసి చికిత్స నిమిత్తం మతాశిశు ఆసుపత్రికి వచ్చారు. అయితే ఇదే క్రమంలో ఓ మహిళ ఓ వ్యక్తితో కలిసి బాలుడిని కిడ్నాప్ చేసింది. తల్లిదండ్రులు ఆసుపత్రిలో బాలుడు కనిపించకపోవడంతో డయల్ II2కు ఫిర్యాదు చేయగా పోలీసులు రంగంలోకి దిగారు. సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా ఓ మహిళ బాలుడిని కిడ్నాప్ తీసుకెళ్తున్నట్లు రికార్డయ్యాయి. సీపీ సాయిచైతన్య 8 బృందాలను ఏర్పాటు చేశారు. ఏసీపీ శ్రీశైలం ఆధ్వర్యంలో మహిళతో పాటు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సిద్దిపేట జిల్లాలోని దౌల్తాబాద్ లో వారిని పట్టుకుని బాలుడిని రక్షించారు.
🏠 Home