🏠 veguchukkanews.online
Watermark
Newspaper Logo
veguchukkanews.online | Date: 28 Aug, 2026 | Page: 1

నిజామాబాద్ : కాకతీయ కిడ్స్ కళాశాలలో.. "ప్లేస్మెంట్ డ్రైవ్". - 137 మంది విద్యార్థినులు ఎంపిక.


- ప్లెస్మెయిన్, టాస్క్ సంస్థల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహణ.

వేగుచుక్క న్యూస్,
నిజామాబాద్ : జిల్లా కేంద్రంలోనీ మాణిక్ బండార్ లో గల "కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సె ఫర్ ఉమెన్" ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం ఘనంగా ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. విద్యార్థినులకు మెరుగైన ఉద్యోగావకాశాలు కల్పించే లక్ష్యంతో ప్లేస్మైన్ సంస్థ, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ - టాస్క్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించగా, 137 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. ఈసందర్భంగా ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ బి. మహేందర్ మాట్లాడుతూ, విద్యార్థులు తమ ప్రతిభను నిరూపించుకుని మంచి కెరీర్ ను నిర్మించుకోవడానికి ఇటువంటి అవకాశాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. విద్యార్థుల్లో ఉద్యోగ నైపుణ్యాలు పెంపొందించేందుకు నిరంతరం శిక్షణా కార్యక్రమాలు, అప్టిట్యూడ్ ప్రిపరేషన్, కమ్యూనికేషన్ స్కిల్స్, మాక్ ఇంటర్వ్యూలు మరియు పరిశ్రమ ఆధారిత కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని ప్రముఖ సంస్థలను కళాశాలకు రప్పించి విద్యార్థులకు ఆధిక సంఖ్యలో ఉద్యోగవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు .

*కళాశాల యాజమాన్యం హర్షం.*

ప్లేస్మెంట్ లో 137 విద్యార్థినులకు వివిధ ఉద్యోగాలకు ఎంపిక కావడం పట్ల కళాశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. ఎంపికైన విద్యార్థులకు వారి భవిష్యత్ కెరీర్ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన సంస్థలకు, ప్రిన్సిపాల్ సెల్వకుమార్ రాజా, వైస్ ప్రిన్సిపాల్ జి. సాయరెడ్డి, టిపిఓ మహేందర్ లకు కళాశాల యాజమాన్యం అభినందనలు తెలిపారు.
🏠 Home