🏠 veguchukkanews.online
Watermark
Newspaper Logo
veguchukkanews.online | Date: 08 Aug, 2026 | Page: 1

ఆర్మూర్: "నలంద"లో వైభవంగా "బోనాల పండుగ" సంబరాలు. - విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో చదవాలి. - చార్టెడ్ అకౌంటెంట్ , ప్రముఖ సామాజికవేత్త ఈరవత్రి రాజశేఖర్.


- ఆటపాటలతో అలరించిన విద్యార్థులు.

వేగుచుక్క న్యూస్, ఆర్మూర్: పట్టణంలోని మామిడిపల్లిలో గల నలంద హై స్కూల్లో బోనాల పండుగ, ఫ్రెషర్స్ పార్టీ సంబరాలు శనివారం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఆర్మూర్ చార్టెడ్ అకౌంటెంట్ , ప్రముఖ సామాజికవేత్త ఈరవత్రి రాజశేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ, కులమతాలకు అతీతంగా బోనాల పండుగ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. విద్యార్థులందరూ ఉన్నత లక్ష్యాలు పెట్టుకొని దాని అనుగుణంగా చదువుకోవాలని, అందరిపై అమ్మవారి కటాక్షం ఉండాలని తెలిపారు. కార్యక్రమం బాగంగా అమ్మవారి దీపాలని ఎత్తుకున్న విద్యార్థులను, పోతురాజుల వేషధారణ వేసిన విద్యార్థులను అభినందించారు.

*నలంద స్కూల్ కరస్పాండెంట్ ప్రసాద్ మాట్లాడుతూ,*

ఈ విద్యా సంవత్సరం పాఠశాలలో చేరిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి సబ్జెక్టులో మంచి మార్కులు సాధించాలని, విద్యా సంవత్సరం నిర్వహించే ఐఐటి, ఒలంపియాడ్ మరియు అబాకస్ కాంపిటీటివ్ పరీక్షలు అందరూ రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించాలని కోరారు.

*నలంద స్కూల్ ప్రిన్సిపాల్ సాగర్ మాట్లాడుతూ,*

ప్రతి ఒక్క విద్యార్థి వారి యొక్క నెగటివ్స్ తొలగించుకుని, పాజిటివ్ గా ఆలోచిస్తూ చదువులో తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకోవాలని కోరారు. పిల్లల అమ్మవారి కటాక్షం అందరి పైన ఉండాలని కోరారు. ఈ బోనాల సంబరాలలో విద్యార్థులు పోతురాజు, అమ్మవారి వేషధారణలో బోనాలను అమ్మవారికి సమర్పించారు. పోతురాజులు, అమ్మవారి వేషధారణలో విద్యార్థులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బోనాల సంబరాలలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
🏠 Home