వడ్డెరలు "ఐక్యంగా పోరాడితేనే" హక్కులు సాధ్యం. - జాతీయ వడ్డెర సంఘం అధ్యక్షుడు ఫీట్ల శ్రీధర్.
- వడ్డెర సంఘం నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లా అవగాహన సదస్సులో...
వేగుచుక్క న్యూస్, నిజామాబాద్: స్వాతంత్రం సిద్ధించి ఏళ్లు గడుస్తున్న వడ్డెరుల బతుకుల్లో వెలుగులు లేవని, ఐక్యంగా పోరాడి హక్కులు సాధించుకోవాలని జాతీయ వడ్డెర సంఘం అధ్యక్షుడు ఫీట్ల శ్రీ ధర్ పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లాకేంద్రంలో వడ్డెర సంఘం ఉమ్మడి జిల్లా అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. వడ్డెర కులస్థుల బతుకులు మారాలంటే ప్రజాస్వామ్యబద్ధమైన ఉద్యమాలు నిర్మించాలని అన్నారు. వడ్డెరల సామాజిక, ఆర్థిక, విద్యా అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. సంఘటితంగా ముందుకు సాగితేనే వడ్డెరల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, హక్కుల పరిరక్షణతో పాటు సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి అందేలా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వడ్డెర సమాజం ఐక్యతను మరింత బలోపేతం చేసి, భవిష్యత్ తరాలకు మెరుగైన అవకాశాలు కల్పించేందుకు అందరూ కలిసి పనిచేయాలని ఫీట్ల శ్రీధర్ సూచించారు.
*సంఘం జాతీయ సలహాదారు దండి వెంకట్, రాష్ట్ర అధ్యక్షుడు వల్లెపు శివకుమార్ మాట్లాడుతూ..*
భారతదేశ నిర్మాణం, అభివృద్ధిలో వడ్డెర కులస్థులు చారిత్రకంగా విశేష సేవలు అందించినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారికి తగిన గుర్తింపు ఇవ్వలేదన్నారు. ప్రభుత్వాలు తమకు విద్య, ఉపాధి, భూమి, గృహాలు, సంక్షేమ పథకాలు, నైపుణ్యాభివృద్ధి, స్వ యం ఉపాధి వంటి రంగాల్లో సముచిత అవకాశాలు కల్పిం చాలని డిమాండ్ చేశారు. రాజకీయ రంగంలో వడ్డెర సమా జానికి తగిన ప్రాతినిధ్యం కల్పించే బాధ్యత అన్ని రాజకీయ పార్టీలపై ఉందన్నారు. వడ్డెర యువత విద్య, ఉద్యోగాలు, స్వయం ఉపాధి, సామాజిక చైతన్య కార్యక్రమాల్లో ముందుండా లని, మహిళలు కూడా నాయకత్వ బాధ్యతలు చేపట్టాల న్నారు. గ్రామ స్థాయి నుంచి సంఘాలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఆర్.నర్సింహులు, చెల్లా ఎల్లయ్య, శంకర్, ప్రధాన కార్యదర్శి భక్తుల శంకర్, నాయకులు వేముల రవి, పీట్ల శ్రీనివాస్, డి.రాజు, జి.రాజన్న పల్లపు మహేష్, రాములు పాల్గొన్నారు.