🏠 veguchukkanews.online
Watermark
Newspaper Logo
veguchukkanews.online | Date: 28 Jul, 2026 | Page: 1

నిజామాబాద్: న్యాయం కోసం... తెలంగాణ"ధూంధాం కళాకారుల నగారా". - అర్హులైన వారికి ఉద్యోగాలు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలనీ డిమాండ్. - బోనాల జాతరతో వినూత్న నిరసన.


వేగుచుక్క న్యూస్, నిజామాబాద్: న్యాయం కోసం... "తెలంగాణ ధూంధాం కళాకారులు నగారా" మోగించారు. ప్రభుత్వం అర్హులైన వారికి ఉద్యోగాలు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలనీ డిమాండ్ చేశారు. అమ్మవారి బోనాల జాతరతో వినూత్న నిరసన చేపట్టారు. తెలంగాణ ధూంధాం నిజామాబాద్ జిల్లా కళాకారుల వేదిక ఆధ్వర్యంలో మంగళవారం మాక్లూర్ మండలంలోని ఓట్యాట్ పల్లి లో ఒడ్డేటవ్వ వద్ద బోనాలు సమర్పించారు.
ముందుగా గ్రామంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి కళాకారులు పూల మాల వేశారు. కామన్ నుంచి డప్పు దరువులతో శివ సత్తుల, పోతరాజు నృత్యాలు చేస్తూ అమ్మవారికి బోనాలు సమర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కళాకారులు తెలంగాణ ఉద్యమ పాటలతో ఉత్తేజపరిచారు. ఈ సందర్భంగా తెలంగాణ ధూంధాం నిజామాబాద్ జిల్లా కళాకారుల సంఘం అద్యక్షులు ఆర్టీసీ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి అష్ట గంగాధర్, కోశాధికారి రాంపూర్ సాయిలు మాట్లాడుతూ.. జిల్లా కళాకారుల ఐక్యత చాటేందుకు అమ్మ వారికి బోనాలు సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం
తెలంగాణ ఉద్యమం కోసం కష్టపడిన అర్హులైన అన్ని విభాగాల్లో ఉన్న కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కళాకారులకు ఉద్యోగాలు, ఇండ్ల స్థలాలు వెంటనే ఇవ్వాలన్నారు. అన్ని నియోజకవర్గాలలో జిల్లా ధూంధాం కళాకారుల ఆధ్వర్యంలో త్వరలో కార్యక్రమాలు ఉంటాయన్నారు.

*ఉపాధ్యక్షురాలు రేలారే రేలా గంగా మాట్లాడుతూ*

కళాకారులకు మంచి జరగాలని అమ్మ ఆశీర్వాదం కోసం బోనం సమర్పించడం జరిగిందన్నారు. రాష్ట్రంలోనే ఇలాంటి కార్యక్రమం మొదటి సారి నిజామాబాద్ లో నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. అన్ని జిల్లాలు మా ఐక్యతను
ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
తెలంగాణ ఉద్యమం కోసం అహర్నిశలు కష్టపడి పని చేసిన కళాకారులకు ఉద్యోగాలు, ఇండ్ల స్థలాలు ఇచ్చి ఆదుకోవాలన్నారు. తెలంగాణ వచ్చిన కళాకారుల జీవితాలు పూర్తిగా మారలేదని, ఎంతో దుర్భరంగా ఉన్నాయని గుర్తు చేశారు. వెంటనే ప్రభుత్వం కళాకారుల త్యాగాన్ని గుర్తించాలన్నారు.
జిల్లా లోని కళాకారులు ఒక
కుటుంబంగా ఒకే దగ్గర కలవడం ఉద్యమ సమయాన్ని గుర్తు చేశాయన్నారు. ఉద్యోగాల కోసం కళాకారులు వెయ్యి కండ్లతో ఎదిరి చూస్తున్నారన్నారు. ప్రభుత్వం నుంచి అందించే సహాయం తొందరగా అందించాలని కోరారు. ఈ బోనాల కార్యక్రమంలో ఉపాధ్యక్షులు గంగా, గోదావరి, సాయి లోవోల, సవిత, రాజేందర్ , సలహాదారులు పస్కా నర్సయ్య, పాశం కుమార్, బొడ్డెన్న యాదవ్, కోకిల నాగరాజు, సహాయ కార్యదర్శి కర్క రమేష్, క్రాంతి కుమార్, గోరకంటి రాజు, ఆర్గనైజింగ్ సెక్రెటరీ మహేందర్, ప్రశాంత్ రెడ్డి, మహేష్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు చిట్టిబాబు, మాదాసు గోపి, తోగరి నర్సయ్య, చిన్న రాజేందర్, రవి నాయక్, డప్పు సంతోష్, మనోజ, దివ్య, మానస, స్రవంతి, సమత, లత, శ్వేత జిల్లా ఉద్యమ కళాకారులు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home