కామారెడ్డి: క్విట్ ఇండియా ఉద్యమ స్పూర్తితో... ఆగష్టు 10న "జైల్ భరో". - కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలి. - సిఐటియు జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్
.
వేగుచుక్క న్యూస్, కామారెడ్డి: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, క్విట్ ఇండియా ఉద్యమ స్పూర్తితో... ఆగష్టు 10న "జైల్ భరో" కార్యక్రమం నిర్వహించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. కామారెడ్డి పట్టణంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో శుక్రవారం సీఐటీయు, రైతు, వ్యవసాయ కార్మిక, వృత్తిదారులు, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక, గిరిజన, వృత్తిదారుల ప్రజా వ్యతిరేక విధానాలపై జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ మాట్లాడుతూ... కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గం స్వాతంత్ర రాకముందే పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి, దేశంలో పెట్టుబడిదారులకు కార్పొరేట్లకు అనుకూలంగా వారికి లాభాలు చేకూర్చడం కోసమే లేబర్ కోడ్స్ ను బీజేపీ తెచ్చిందన్నారు. కార్మికులకు కనీస వేతనం నిర్ణయం చేయలేదని, పని భద్రతను గాలికి వదిలి, పని గంటలను పెంచిందన్నారు. ఈపిఎఫ్, ఈఎస్ఐ ను ప్రైవేట్ ఇన్సూరెన్స్ వాళ్లకు అప్పచెప్పుతుందనీ, కార్మికుల మెడకు లేబర్ కోడ్స్ ఉరితాళ్లుగా మారుస్తుందన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చాలని చూస్తుందని అన్నారు.
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా విద్యుత్ను ప్రైవేటీకరించం, మోటర్లకు మీటర్ బిగించం అని చెబుతున్నప్పటికీ, ఈ సంక్షోభం నుండి బయట పడేందుకు భవిష్యత్తో వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టడం లేదా చార్జీలు పెట్టడం (పెంచడం) వంటి నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉన్నదన్నారు. ఈ ప్రక్రియ క్రమేపి విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించడానికి మార్గం సుగమం చేస్తుందనీ, దీనిని నిలువరించేందుకు ప్రజలు ఉద్యమించాలని అన్నారు.
దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఆగస్టు 10న జరుగు జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిఐటియు - రైతు - వ్యవసాయ కార్మిక సంఘం-వృత్తిదారుల సంఘం, గిరిజన సంఘాల పిలుపునిస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కొత్త నరసింహులు, బి వెంకటి, రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మోహన్, దశరథ్ సిఐటియు జిల్లా నాయకులు రాజనర్సు, పట్టణ నాయకులు నర్సింగరావు , ప్రభు, సంతు, దీవెన, శివ రాజవ్వ ఇందిరా, ఏ రాజు, సంతోష్, అబ్బాస్ , కృష్ణ,సాయి తదితరులు పాల్గొన్నారు.