ఘనంగా టీజీఏ ఆవిర్భావ దినోత్సవం.
వేగుచుక్క న్యూస్, నిజామాబాద్: రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన నాలుగు సంఘాల్లో ఒకటైన జాతీయ జర్నలిస్ట్ యూనియన్ అనుబంధ తెలంగాణ జర్నలిస్ట్ ఫోరమ్ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను, జిల్లా అధ్యక్షుడు, జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యుడు జి. సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు.
ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలోని మానసిక వికలాంగుల (స్నేహ సొసైటీ ఫర్ రూరల్ కన్స్ట్రుక్షన్) ప్రత్యేక పాఠశాలలో విద్యార్థులకు బిస్కెట్లు తదితర వితరణ చేపట్టారు. ఈ సందర్భంగా సాయి ప్రసాద్ మాట్లాడుతూ... టీజీఏ ఫౌండర్ ఉప్పల లక్ష్మణ్, రాష్ట్ర అధ్యక్షుడు కెవి రమణారావు, ప్రధాన కార్యదర్శి గోరి నేతృత్వంలో జర్నలిస్టుల హక్కుల సాధన కోసం పోరాటం సాగుతోందని అన్నారు. అలాగే సామాజిక సేవ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారని కొనియాడారు.
స్నేహ సొసైటీ ఫర్ రూరల్ కన్స్ట్రుక్షన్ కార్యదర్శి సిద్దయ్య మాట్లాడుతూ, టీజీఏ అవిర్భావాన్ని కేవలం వేడుకగానే కాకుండా, ఆసుపత్రులలో రోగులకు పండ్లు పంపిణీ చేయడం, విద్యార్థులకు నోట్‌బుక్స్ అందజేయడం, ఇతర వితరణ వంటి సేవ కార్యక్రమాలతో నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో టీజీఏ ప్రతినిధులు కొట్టూరి ప్రమోద్, తమ్మాలి పాండు, ఆర్.శ్రీనివాస్ రెడ్డి, పి.యశస్వి, పి. మురళీ కృష్ణ, వికాస్ గైక్వాడ్, పులగం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.