🏠 veguchukkanews.online
Watermark
Newspaper Logo
veguchukkanews.online | Date: 19 Jul, 2026 | Page: 1

ఆగస్టు 2 న "ఊర పండుగ". - అందరి సహకారంతో ఘనంగా నిర్వహిద్దాం. - సర్వ సమాజ్ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ*


వేగుచుక్క న్యూస్, నిజామాబాద్: నగరం మొత్తం ఏకమై నిర్వహించే అతిపెద్ద "ఊర పండుగ"ను ఆగస్టు 2న నగర ప్రజలందరి సహకారంతో వైభవోవేత్తంగా నిర్వహిద్దాం అని సర్వసమాజ్ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ తెలిపారు. ఊర పండగ నేపథ్యంలో సన్నాహక సమావేశాన్ని ఆదివారం సిర్నాపల్లి గడిలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆగస్టు 2 న నిర్వహించే ఊర పండగ కోసం ఏర్పాట్లను కూడా ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఊర పండుగలో భాగంగా జులై 30న బండారు పోస్తున్నట్లు తెలిపారు. గత సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా నగరంలోని అన్ని సంఘాలను కలుపుకొని అత్యంత వైభవంగా ఊర పండుగ ను నిర్వహిస్తామని ఆయన అన్నారు.

*దేవాలయాల పరిరక్షణ కోసం కమిటీలు, దేవుడి ఆస్తుల రక్షణ కోసం ఉద్యమం*

నగరంలో రోజురోజుకీ పెరుగుతున్న భూకబ్జాలు, ముఖ్యంగా దేవాలయాల స్థలాలను దోచుకుంటున్న వారి పట్ల నిరసన వ్యక్తం చేస్తూ దేవాలయాలు భూములను పరిరక్షించాలని ఈ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది, దేవాలయాల పరిరక్షణ కోసం సర్వ సమాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీలు వేయాలని కూడా నిర్ణయించడం జరిగినట్లు ఎండల లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ సమావేశంలో సర్వ సమాజ కమిటీ కన్వీనర్ రామర్తి గంగాధర్, కోకన్వీనర్ ఆదే ప్రవీణ్, అంతి రెడ్డి సుదన్, తొండూరు అశోక్, బంటు బలరాం, భక్త వత్సలం, సత్యపాల్ మరియు అన్ని కుల సంఘాలు కమిటీల సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.
🏠 Home