🏠 veguchukkanews.online
Watermark
Newspaper Logo
veguchukkanews.online | Date: 17 Jul, 2026 | Page: 1

కమిషన్ల కాంగ్రెస్ ప్రభుత్వం కూలడం ఖాయం. - ఫీజు రియంబర్స్ మెంట్ కోసం ఉద్యమ ఆగదు. - ఎంపీ ధర్మపురి అరవింద్ హెచ్చరిక.


- ఇందూరు రణభేరి సభతో బీజేపీ నిరసన.

వేగుచుక్క న్యూస్, నిజామాబాద్: విద్యార్థుల ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిల విడుదలకు సీఎం రేవంత్ రెడ్డి 40 శాతం కమిషన్ అడుగుతున్నాడని, కమిషన్ల కాంగ్రెస్ ప్రభుత్వం కూలడం ఖాయం అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ హెచ్చరించారు. శుక్రవారం పీజు రియంబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ బిజెపి, బిజేవైయం ఆధ్వర్యంలో ధర్నా చౌక్ లో ఇందూర్ రణ బెరి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ...ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు ఇవ్వకపోతే ఓక జనరేషన్ కతం అవుతుంది అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజా సంఘాలు, మెధావులు, ప్రజలు కలిసి కోట్లాడాలన్నారు. రాహుల్ గాంధి, రేవంత్ రెడ్డి లు విద్యార్థులను, యువతను రెచ్చగొట్టి కేసీఆర్ ను గద్దె దించి అధికారంలోకి వచ్చారు. కానీ వచ్చిన తర్వాత విద్యార్థులు, యువత కు అవసరమైన సంక్షేమ పథకాలు బంద్ చేసి మోసం చేసిండని అన్నారు. ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు పోన్ చేసి రేవంత్ రెడ్డికి 40 శాతం కమిషన్ ఇవ్వడానికి సిద్ధమని అరవింద్ తెలిపారు. రాయదుర్గంలో కోట్ల రూపాయాల భూములు అమ్మి సొమ్ము చేసుకున్న విద్యార్థులు మాత్రం ఫీజు రియంబర్స్ మెంట్ కు నిధులు లేవనడం విడ్డురం అన్నారు. ఎడ్యుకేషన్ లేని ఎడ్యుకేషన్ మంత్రి రేవంత్ రెడ్డి. ముగ్గురు వివిధ సంక్షేమ మంత్రులు. ఉండగా రాష్ట్రంలో విద్యార్థుల ఫీజు రియంబర్స్ మెంట్ కోసం అల్లాడుతుంటే రేవంత్ రెడ్డి మనుమడికి పూరిలు చేస్తున్నాడనీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్...కమీషన్ ల సర్కారు

*ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేవరకు పోరాటం: అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ...*

రాష్ట్రంలో కమీషన్ ల సర్కారు కొనసాగుతుందని, ప్రతి పనిలో పర్సంటేజీలు తీసుకుంటున్నారని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. పేద, వెనుకబడిన వర్గాల విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడంలో ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఎంతో కీలకమైందన్నారు. ఇలాంటి పథకానికి రేవంత్ రెడ్డి సర్కారు తూట్లు పొడుస్తూ రద్దు చేసే దిశగా కుట్రలు పన్నుతుందన్నారు. రాష్ట్రంలో సుమారు రూ.12 వేల కోట్లు బకాయిలు ఉన్నా..స్పందించకపోవడం సిగ్గు చేటన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ అవినీతి విధానాల వల్ల రాష్ట్రంలో 14 లక్షల మంది విద్యార్థుల భవితవ్యం గందరగోళంగా మారిందన్నారు. బడుగు బలహీన వర్గాలను శాశ్వతంగా అణచివేసే కుట్ర ఫీజు రియంబర్స్మెంట్ను నిర్వీర్యం చేసి నోటికాడి ముద్దను లాక్కోవడమేనన్నారు. రాష్ట్రంలో మూడు ట్రిలియన్ అభివృద్ధి పనుల పేర్లు చెప్పే రేవంత్ రెడ్డి విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఎందుకు చెల్లించలేకపోతున్నారని ప్రశ్నించారు. విద్యార్థుల హక్కుల కోసం బిజెపి పోరాటం ఎన్నటికీ ఆగదని, మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ లో కూడా 40 శాతం కమిషన్లను కోరడమంటే ఇంతకన్నా పనికిమాలిన ప్రభుత్వం మరోకటి లేదన్నారు. ఎన్నికలకు ముందు నిరుద్యోగులకు, విద్యార్థులకు అనేక హామీలిచ్చి తుంగలో తొక్కారని ఆరోపించారు.

ఈ కార్యక్రమం జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి తో పాటు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ప్రకాష్ రెడ్డి, మోహన్ రెడ్డి, కార్పొరేటర్ లు, బిజేవైఎం, బిజేపి, ఎబివిపి నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
🏠 Home