🏠 veguchukkanews.online
Watermark
Newspaper Logo
veguchukkanews.online | Date: 09 Jul, 2026 | Page: 1

శ్రీవారాహీమాత" గర్భగుడి పనులకు ఘనంగా శ్రీకారం. పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ, ఆలయ చైర్మన్ మంచాల జ్ఞానేందర్.

ప్రత్యేక పూజల నడుమ కృష్ణశిలతో ప్రారంభమైన గర్భాలయ నిర్మాణం.

వేగుచుక్క న్యూస్, నిజామాబాద్, జూలై 9: నగరంలోని అమ్మ వెంచర్‌లో నిర్మితమవుతున్న శ్రీ వారాహీమాత దేవాలయంలో అత్యంత పవిత్రమైన గర్భగుడి నిర్మాణ పనులకు గురువారం ఘనంగా శ్రీకారం చుట్టారు. ఆలయ గర్భాలయ నిర్మాణానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ శంకుస్థాపన నిర్వహించి, కృష్ణశిల స్టోన్‌తో నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య నిర్వహించిన ప్రత్యేక పూజలు, హోమాది కార్యక్రమాలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరిగాయి. గురువారం దశమి తిథిన, ఆషాఢ మాసం ప్రారంభానికి ముందు, అలాగే వారాహి నవరాత్రులు ప్రారంభానికి ముందే ఈ పుణ్యకార్యాన్ని నిర్వహించడం అత్యంత శుభప్రదమని భక్తులు, నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు. తమిళనాడు నుంచి విచ్చేసిన నిపుణులైన శిల్పులు గర్భగుడి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఆలయ నిర్మాణంలో అత్యంత ప్రధానమైన గర్భగుడిని సంప్రదాయ శిల్పకళా విధానంలో అత్యున్నత ప్రమాణాలతో నిర్మించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

*అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ మాట్లాడుతూ,*

వారాహీ అమ్మవారి కృపాకటాక్షాలు నగర వాసులపై ఉండాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ఆకాంక్షించారు. జిల్లాలోని తొలి వారాహి అమ్మవారి ఆలయాన్ని నిర్మించడం అభినందనీయమన్నారు. కృష్ణశిల తో ఆలయాన్ని నిర్మించటం సంతోషకరమన్నారు. ఇందూరులో ఆధ్యాత్మిక చింతన పెరిగిందని, హిందువుల ఐక్యతకు ఆలయాలు దోహదపడతాయన్నారు. యువత ఆధ్యాత్మికత వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నిత్య ఆలయ దర్శనం ఎంతో శ్రేయస్కరమన్నారు. ఇకపై జరిగే వారాహీ అమ్మవారి పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు.

*ఆలయ కమిటీ చైర్మన్ మంచాల జ్ఞానేందర్ మాట్లాడుతూ..*

శ్రీ వారాహీమాత ఆలయ నిర్మాణంలో గర్భగుడి పనులు ప్రారంభం కావడం అత్యంత చారిత్రాత్మకమైన, ఆధ్యాత్మికంగా విశిష్టమైన ఘట్టమని అన్నారు. భక్తుల సహకారం, దాతల ఆశీస్సులతో ఆలయ నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేస్తామని తెలిపారు. భక్తులందరూ ఆలయ నిర్మాణంలో భాగస్వాములు కావాలని, అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆయన హృదయపూర్వకంగా కోరారు. ఈ కార్యక్రమంలో ఎల్‌వీఆర్ షాపింగ్ మాల్ అధినేత శివప్రసాద్, డి. అశోక్, సాయిప్రసాద్, సుదర్శన్, సంజీవ్, ఆంజనేయులు, జయరాం, వెంకటేశం, శ్రీలక్ష్మి, జ్యోతి, హరిణి, పింకీ, శివరాములు తదితరులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
🏠 Home