అసెంబ్లీ ప్రాంగణంలో.... ఎమ్మెల్యే వీరేశం నూతన *"విప్ ఛాంబర్"* ప్రారంభం. - పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖులు.
వేగుచుక్క న్యూస్, హైదరాబాద్ : ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలోని తన నూతన *"విప్ ఛాంబర్"* ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు గమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్‌లు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ , తదితరులు హాజరై వేముల వీరేశంకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజాసేవలో మరింత సమర్థవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.