🏠 veguchukkanews.online
Watermark
Newspaper Logo
veguchukkanews.online | Date: 02 Jul, 2026 | Page: 1

దూర విద్యా పితామహుడు ప్రొ.జి.రాంరెడ్డికి ఘన నివాళి

.వేగుచుక్క న్యూస్,
హైదరాబాద్, జూలై 02, 2026: దేశంలోనే మొట్టమొదటి సారి దూర విద్యను ప్రవేశ పెట్టిన దూర విద్యా పితామహుడు ప్రొ. జి. రామ్ రెడ్డి వర్ధంతిని డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ వ్యవస్థాపక ఉపకులపతి ప్రొ.జి. రామ్ రెడ్డి వర్ధంతి సందర్భంగా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో “ప్రో.జి. రామ్ రెడ్డి” చిత్రపటానికి ఘనంగా పుష్పాంజలి అర్పించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి, ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు డా. పరకాల ప్రభాకర్, రిజిస్ట్రార్ డా. యల్.విజయ కృష్ణా రెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ ప్రొ.జి.పుష్ప చక్రపాణి, ప్రొ. ఇ. సుధారాణి, ప్రొ. ఆనంద్ పవార్, ప్రొ. కె. శ్రీదేవి, ప్రొ. పి. వెంకటర రమణ, ప్రొ. ప్రమీలా కేతావాత్, ప్రొ. మేరీ సునంద, ప్రొ. చంద్ర కళ, డా. వెంకటేశ్వర్లు, ఎన్.సి. వేణుగోపాల్, పలు విభాగాల అధిపతులు, డీన్స్, బోధన మరియు భోదనేతర సిబ్బంది, అన్ని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొని ప్రొ. జి. రామ్ రెడ్డి చిత్ర పటానికి ఘనంగా నివాళి అర్పించారు.
🏠 Home