🏠 veguchukkanews.online
Watermark
Newspaper Logo
veguchukkanews.online | Date: 02 Jul, 2026 | Page: 1

10న విద్యాసంస్థల బంద్. విజయవంతం చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపు.

వేగుచుక్క న్యూస్, నిజామాబాద్::
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఈనెల 10 న జరిగే కేజీ టు పీజీ విద్యాసంస్థల బంద్ ను విజయవంతం చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాలు (SFI -AISF-PDSU -AIFDS - PDSU -AIPSU సంఘాల నాయకులు పిలుపునిచ్చారు .నిజామాబాద్ నగరంలో సుభాష్ నగర్ లో గురువారం నిర్వహించిన విలేఖర్ల స్జసమావేశంలో వారు మాట్లాడారు. ముందుగా *పి డి ఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్* మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని, విద్యాశాఖ కి ఇప్పటివరకు మంత్రిని కేటాయించలేదని, 24 వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేలకు కుదింపు చేసే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థలలో విద్య వ్యాపారాన్ని అరికట్టడానికి ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని, పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ నిధులు 9000 వేల కోట్లను విడుదల చేయాలని, అంతే భవనాల్లో కొనసాగుతున్న పాఠశాలలకు హాస్టల్స్ మరియు గురుకులాలకు సొంత భవనాలను నిర్మించాలని, ప్రభుత్వ పాఠశాలలో సకాలంలో యూనిఫామ్స్ మరియు పుస్తకాలు ఇవ్వాలని, ప్రవేట్ విద్యాసంస్థలలో పుస్తకాలు యూనిఫార్మ్ నోటుబుక్ ల విక్రయాల కేంద్రాలను మూసివేయాలని, నూతన విద్యా విధానం 2020 ను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయకుండా అసెంబ్లీలో తీర్మానం చేయాలని, యూనివర్సిటీలలో ఖాళీగా ఫోఫెసర్స్ ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 10న జరిగే విద్యాసంస్థల బందుకు విద్యార్థులు, ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు స్వచ్ఛందంగా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విగ్నేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు సుబోధ్, పి డి ఎస్ యూ జిల్లా అధ్యక్షులు డా. కర్క గణేష్, ఏ ఐ ఎఫ్ డి ఎస్ వినోద్, ఏ ఐ పి ఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి బోడ అనిల్ , వివిధ విద్యార్థి సంఘాల నాయకులు మనోజ్,శ్రీకర్, రాజు,కిషోర్,నీరజ్, శివ, ఆశుర్, సునీల్,సూర్యాపాల్,పవన్,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home